
జనం న్యూస్, ఫిబ్రవరి 03,అచ్యుతాపురం:
అచ్యుతాపురం మండల కేంద్రంలో ఉన్న కైట్స్ జూనియర్ కళాశాల ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఎం. వినోద్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రాక్టికల్ పరీక్షలు పగడ్బందీగా జరుగుతున్నాయని, ఉదయం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం,మధ్యాహ్నం ఇంటర్మీడియట్ రెండో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, కళాశాల కరస్పాండెంట్ రెడ్డి చిరంజీవి ఆయన వెంట ఉన్నారు.