
జనం న్యూస్ ఫిబ్రవరి 3 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ
ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉండేలా, 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ దిశగా బడ్జెట్.
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్దపీట వేయడం జరిగింది.
సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు 2 వేల కోట్ల రూపాయలు ప్రకటన.
ప్రపంచ దేశాల్లో విశ్వ గురువుగా భారతదేశాన్ని నిలిపే విధంగా ఉన్న బడ్జెట్.
.వీరన్న చౌదరి
తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గం, బిజెపి సీనియర్ నాయకుడు నీరుకొండ వీరన్న చౌదరి మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 9 వ సారి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో భారతదేశం ప్రపంచ దేశాలలో అగ్రస్థానంలో ఉండేలాగా 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ దిశగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అభివృద్ధికి 1129 కోట్లు, అమరావతి సమీకృత పట్టణాభివృద్ధికి 432 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, గ్రామీణ రహదారులకు 500 కోట్లు మంజూరు, పట్టణ రహదారులు వంతెనలు నిర్మాణానికి 350 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి 155 కోట్లు, పట్టణ తాగు, మురికినీటి పారుదలకు 800 కోట్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా చెన్నై, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా లకు సంబంధించి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ క్యారిడార్ ను ప్రకటించడం జరిగింది. ఇలా ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్లో పెద్దపీట వేయడం జరిగిందని తెలిపారు. వైద్య రంగానికి వేల కోట్లు రూపాయలతో క్యారిడార్ లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు .2వేల కోట్లు ప్రకటించడం జరిగిందని అన్నారు. ఎంఎస్ఎంఈ కి .10 వేల కోట్లు ప్రకటించడం జరిగిందని, ఆయుష్మాన్ భారత్ పథకంలో వైద్యానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు వేల కోట్లు ప్రకటించడం జరిగిందని అన్నారు. మూల ధనానికి.12.2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, చేపల పరిశ్రమకు పెద్దపీట వేయడం జరిగిందని, అరకు,పులికాట్ టూరిజం పరిశ్రమలు డెవలప్మెంట్ చేయడం జరిగిందని అన్నారు. కార్గో అభివృద్ధి కి ప్రత్యేక కారిడార్ 2047 వరకు డేటా సెంటర్ లకు సంబంధించి టాక్స్ హాలిడే ను ప్రకటించడం జరిగిందని తెలిపారు. భారత దేశాన్ని 2047 వ సంవత్సరానికి వికసిత భారత్ ప్రపంచ దేశాలలో విశ్వ గురువుగా భారతదేశాన్ని నిలిపే విధంగా ఈ బడ్జెట్ ఉందని, ఇంకమ్ టాక్స్ రిటర్న్స్ వేసుకోవడం సరళీకృతం చేయడం జరిగిందని పేర్కొన్నారు. గతంలో డిసెంబర్ 31 వరకు ఉంటే ఇప్పుడు మార్చి 31 వరకు గడువు పెంచడం జరిగిందని, ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ సాధారణ పౌరులు సైతం వేసుకునేలా సులభతరం చేయడం జరిగిందని తెలిపారు. ఇన్కమ్ టాక్స్ గతంలో అవకతవకలు జరిగితే వారికి చట్టపరమైన చర్యలు ఉండేవి, వాటిని ఇప్పుడు రద్దుచేసి పెనాల్టీ మాత్రమే వేయడం జరిగిందని అన్నారు. ఇలా అనేక మార్పులతో ప్రజలకు, మహిళల సాధికారతకు షీమార్ట్ లు ఏర్పాటుకు నిధులు కేటాయించడం జరిగినట్లు తెలిపారు. రక్షణ రంగానికి గతం కంటే 15% నిధులు ఎక్కువ కేటాయించడం జరిగిందని, భారతదేశాన్ని స్వదేశీ స్వావలంబన దిశగా ఆత్మ నిర్భర భారత్, వికసిత్ భారత్-2047 దిశగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని కనకేశ్వరరావు తెలియజేశారు. 2014 లో 17 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రకటిస్తే, ఈ 2026 లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం లో.53,47,315 కోట్ల రూపాయలు గా బడ్జెట్ ను రూపొందించిన ఘనత ఎన్డీయే కూటమి ప్రభుత్వానిదే వీరన్న చౌదరి అన్నారు.