
బిచ్కుంద ఫిబ్రవరి 3 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద లో ఐ క్యు ఏసి మరియు కెరీర్ గైడెన్స్ ఆధ్వర్యంలో నాంది ఫౌండేషన్ చేత బాలికల కొరకు ప్రత్యేక ఉదోగ్య నైపుణ్య శిక్షణ కార్యక్రమం గత వారం రోజుల నుండి కొనసాగి నేటితో ముగిసిందని కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కె.అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న ఆత్మ న్యూనత భావాన్ని, ఆత్మ విశ్వసాన్ని పెంపొందించారని , విద్యార్థులకు ఎంతో ఉపయోగ కరమైన కార్యక్రమం అని తెలిపారు.శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు రిసోర్స్ పర్సన్ గా డాక్టర్ చిరంజీవి మరియు భవాని గార్లు కు నాంది ఫౌండేషన్ వారికి మా కళాశాల ఎంచుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కళాశాల అధ్యాపక బృందం వారికి శాలువాతో సన్మానించారు . ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.జి.వెంకటేశం అకాడమీ కోఆర్డినేటర్ డా . టి. హన్మండ్లు, ఐక్యూఎసి కోఆర్డినేటర్ డా. జి. రమేష్ బాబు, మహిళా సాధికారత సమన్వయకర్త వై. రేవతి ప్లేస్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డా. టి. అశోక్ రావు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

