
జనం న్యూస్, ఫిబ్రవరి 03,అచ్యుతాపురం:
కార్మికులకు ఉద్యోగులకు నష్టదాయకమైన లేబర్ కోడ్ లు రద్దు చేయాలని ఈరోజు అచ్యుతాపురం,హరిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆశా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వైద్యాధికారులకు సీఐటీయూ నాయకులు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా సీఐటీయూ అచ్యుతాపురం మండల కన్వీనర్ కూండ్రపు సోమునాయుడు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు కార్మికులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని,చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించి,అన్ని రకాల సెలవులు ఇవ్వాలని,సంక్షేమ పథకాలు అమలు చేసి ఆరోగ్య రంగాన్ని జిడిపిలో 6 శాతం నిధులు కేటాయించాలని, అలాగే 10 లక్షలు ఇన్సూరెన్స్ కల్పించాలని,ఏఎన్ఎం, జిఎన్ఎం శిక్షణ పొందిన ఆశాలకు పర్మినెంట్ పోస్టులు భర్తీకి ప్రాధాన్యత కల్పించాలని ఫిబ్రవరి 12న జరిగే దేశ వ్యాప్త సమ్మెలో ఆశాలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మంగమ్మ,దుర్గ,సరోజినీ,సూర్యలక్ష్మి,భారతి,దేవుడమ్మ తదితర ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
