
జనం న్యూస్ ఫిబ్రవరి 3 ముమ్మిడివరం ప్రతినిధి గంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ఐ పోలవరం మండలం జి మూలపాలెం గ్రామంలో నీతి పూడి వరాహ పల్లపు రాజు కు చెందిన తాటాకు ఇల్లు గ్యాస్ లీకేజ్ వల్ల అగ్ని ప్రమాదం ఘటనలో నష్టపోయిన బాధితులను ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పరామర్శించారు. ప్రమాద స్థలాన్ని స్వయంగా పరిశీలించి, బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో సమస్తం కోల్పోయిన బాధితులకు నిత్యావసరాలు 25 కేజీల బియ్యం, నిత్యవసర వస్తువులు, ఐదువేల రూపాయలు నగదు అందించారు. అలాగే నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అందే సహాయం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే , ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ విజయశ్రీ, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, గుత్తుల సాయి, కాకర్లపూడి రాజేష్, సూరిబాబు రాజు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.