
జనం న్యూస్,4 ఫిబ్రవరి, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి చింతలగట్టు నర్సిములు )
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని, ఝరాసంగం గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు, రోడ్డుపై నిర్మించిన వంతెన, కొన్ని నెలల క్రితం కూలిపోయింది. ఇరుకైన రోడ్డు వల్ల, వాహనదారులు, పాద చారులు, ఇబ్బంది పడుచున్నారు. మహాశివరాత్రి సందర్భంగా, కేతకి సంగమేశ్వర స్వామిని పూజించటానికి, ( జాతరకు ) మన రాష్ట్రం తో పాటు, కర్ణాటక, మహారాష్ట్రల నుండి, భక్తులు అధిక సంఖ్యలో, తమ వాహనాలపై రాకపోకలు కొనసాగిస్తారు. భక్తులకు స్థానిక ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఈ రోడ్డును మరమ్మతు చేసి, గుంతలు పూడ్చాలని వాహనదారులు, మరియు ప్రజలు కోరుచున్నారు.