
జనం న్యూస్ 04 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా, పార్టీ కేంద్ర కమిటీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), జిల్లా యువజన విభాగం కార్యవర్గ సభ్యునిగా తోట వాసును నియమించారు.మజ్జి శ్రీనివాసరావు మరియు సిరమ్మకు కృతజ్ఞతలు
ఈ నియామకంపై తోట వాసు స్పందిస్తూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)కు మరియు తన ఎదుగుదలకు నిరంతరం ప్రోత్సాహాన్ని అందిస్తున్న చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మర్యాదపూర్వక కలయిక - సత్కారం
మంగళవారం ధర్మపురిలోని నివాసంలో మజ్జి శ్రీనివాసరావును, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు అల్లు అవినాష్‌తో కలిసి తోట వాసు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పూల బొకే అందజేసి కృతజ్ఞత పూర్వకంగా సత్కరించారు.అదేవిధంగా, పార్టీ బాధ్యతల్లో తనను ప్రోత్సహించినందుకు సిరమ్మను కూడా అల్లు అవినాష్ మరియు యువజన విభాగం కార్యకర్తలు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తోట వాసు పేర్కొన్నారు.