అచ్యుతాపురం(జనం న్యూస్): ఉమ్మడి విశాఖ జిల్లాలో అతి పెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడకలో ఈ నెల 12న మహా మాఘ పౌర్ణమి సందర్భంగా పూడిమడక సముద్ర తీరాన్ని స్థానిక సీఐ గణేష్ మరియు ఎస్ఐలు పరిశీలించారు.జాతర సందర్భంగా 11వ తేదీ మంగళవారం రాత్రి జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు మరియు సముద్ర స్నానాల ఏర్పాట్లు వివరాలను జనసేన నాయకులు మేరుగు ప్రవీణ్ కుమార్ ను సీఐ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు పాల్గొన్నారు.