
జనం న్యూస్ జనవరి 4 వికారాబాద్ జిల్లా
పరిగి పట్టణంలో జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర, ఆదేశాల మేరకు మునిసిపల్ ఎన్నికల నిర్వహణను దృష్టిలో ఉంచుకొని పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు కట్టుదిట్టంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తిగా సిద్ధంగా ఉందని ప్రజలకు భరోసా కల్పించడం జరిగింది.ఈ ఫ్లాగ్ మార్చ్‌లో పరిగి డీఎస్పీ శ్రీనివాస్ , పరిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొని, పరిగి పట్టణంతో పాటు సున్నిత ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల కోడ్‌ను కచ్చితంగా పాటించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అదేవిధంగా ప్రజలు ఎవ్వరూ భయాందోళనలకు లోనుకాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో అసాంఘిక చర్యలు, మద్యం అక్రమ రవాణా, నగదు పంపిణీ వంటి వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పరిగి, కుల్కచెర్ల, దోమ పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్.ఐలు, పరిగి సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది, ఏఆర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
