జనం న్యూస్ 8 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)ఎల్కతుర్తి మండల కేంద్రంలోని చౌరస్తాలో బీజేపీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచుకున్నా నేతలు. వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంగా శనివారం ఏల్కతుర్తి మండల కేంద్రంలోని చౌరస్తాలో బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు.మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతు ఢిల్లీ ఫలితాలు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పై ప్రజల విశ్వాసానికి నిదర్శనం అని, మోదీ లక్ష్యాలను అందుకోవడంలో ఢిల్లీ పాత్ర కీలకం అని, ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించడం శుభపరిణామం అని డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారానే అభివృద్ధి సాధ్యం అని బీజేపీ హామీలను ప్రజలు నమ్మి బిజెపికి 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ లో పగ్గాలు అప్పచెప్పరు అని, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి జెండా ఎగురవేయడం ఖాయం అని,ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డు ఇచ్చి వారి స్థాయిని తెలియజేశారు అని అన్నారు. ఈ సందర్భంగా ఈ గెలుపు కొరకు అహర్నిశలు కృషి చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ అభినందనలు తెలియాజెస్తున్నము అని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.