జనం న్యూస్ ఫిబ్రవరి 8 నడిగూడెం మండల పరిధిలోని శ్రీరంగాపురం గ్రామంలో శనివారం ఎస్ బి ఐ బ్యాంకు సహకారంతో వి ఐ డి ఎస్ నిర్వహణలో భాగంగా ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక అక్షరాస్యత, బ్యాంకులో పొదుపు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, పి యం ఎస్ బి వై , జెజెబివై , ఎస్ ఎస్ వై , సైబర్ నేరాలు (1930), డిజిటల్ బ్యాంకింగ్ పై అవగాహన కల్పించారు. కార్యక్రమం లో నడిగూడెం సి ఎఫ్ యల్ కౌన్సిలర్లు ఉదయ్ లక్ష్మీనారాయణ, కోటేశ్వరరావు, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.