
జనం న్యూస్ 05 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఆనందపురం గ్రామంలో మండల వైఎస్సార్సీపీ పార్టీ గ్రామస్థాయి కమిటీల నియామకం మరియు అంకెీకరణ (డిజిటలైజేషన్) ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ అధ్యక్షుడు (చైర్మన్), వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె, 'చిన్న శ్రీను సోల్జర్స్' అధ్యక్షురాలు సిరమ్మ హాజరై అంకెీకరణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా సిరమ్మ మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీలు కీలకమని, ప్రతి కార్యకర్త వివరాలను అంకెీకృతం చేయడం ద్వారా పార్టీ యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. జగనన్న ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆనందపురం మండల పార్టీ అధ్యక్షుడు బంక సత్యం, ఎంపీపీ ప్రతినిధి మజ్జి వెంకటరావు, ఆనందపురం సర్పంచ్ మరియు మహిళా విభాగం అధ్యక్షురాలు చందక లక్ష్మి, రాష్ట్ర విభాగం కార్యదర్శి చందక స్వామి, ఆనందపురం మండల యువజన విభాగం అధ్యక్షుడు చంద్రస్వామి, మండల ప్రధాన కార్యదర్శి చిన్ని రామారావు, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు 'చిన్న శ్రీను సోల్జర్స్' సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు