
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 5 2. 2026
బహిరంగంగా మద్దతు ప్రకటిస్తూ ప్రజల మధ్య విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడాలంటే ప్రజాసేవకు అంకితమైన నాయకుడికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని సమ్మత్ బై పేర్కొన్నారు. గతంలో చేసిన సేవలు, ప్రజల సమస్యలపై స్పందించిన తీరు చూసే ఈసారి సరైన నాయకుడిని ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. 17వ వార్డు ప్రజల అవసరాలు, సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించే శక్తి కౌన్సిలర్ అభ్యర్థికి ఉందని తెలిపారు. యువత, మహిళలు, వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టే నాయకత్వం అవసరమని, అలాంటి నాయకుడికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సమ్మత్ బై స్పష్టం చేశారు. ఈ ప్రచారంలో పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొని తమ మద్దతును ప్రకటించడంతో 17వ వార్డులో ఎన్నికల వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది.