
జనం న్యూస్ 05 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా
వికారాబాద్ పురపాలక సంఘం ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ వార్డు అభ్యర్థులకు మద్దతుగా 18, 19, 21, 29, 30, వార్డుల పరిధిలోని కన్యాలాల్ బాగ్, ఇందిరా నగర్, గరీబ్ నగర్, అంబేద్కర్ నగర్, బుడగ జంగాల కాలనీ, రామయ్య గూడ లలో ప్రచారం నిర్వహించిన వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్. కాంగ్రెస్ పార్టీ తోనే వికారాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని, వికారాబాద్ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
అభివృద్ధి, సంక్షేమం కోసం తామంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ఓటు వేస్తామని కాలనీ వాసులు భరోసా ఇచ్చారు.స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు గడ్డం ప్రసాద్ కుమార్ వెంట ప్రచారంలో పాల్గొన్నారు.