
_ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు
బిచ్కుంద ఫిబ్రవరి 5 జనం న్యూస్
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా.. బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వందన తరపున ప్రచారంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ..ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు..ఎమ్మెల్యే గారికి రమణ స్వామి శాలువాలతో పాటు పూలదండలు వేసి ఘనంగా స్వాగతం స్వాగతం పలికారు..ప్రజల నుంచి లభించిన ఆత్మీయ స్పందన కాంగ్రెస్ పార్టీపై ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది..గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు..కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం వంటి పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు..కాంగ్రెస్ పార్టీ అంటే మాటల రాజకీయాలు కాదు – ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే చేతల పాలన అని స్పష్టంగా తెలియజేశారు..ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ప్రజలు ఘన విజయం అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు..
