
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 5 సెల్ 9550978955
చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్టు ఆధ్వర్యంలో నిన్న బుధవారం ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు స్వగృహంలో వారి ధర్మపత్ని దామచర్ల నాగ సత్య లత చేతుల మీదుగా మహాశివరాత్రిని పురస్కరించుకొని వారి చేతుల మీదుగా నూతన ఆంగ్ల సంవత్సర పార్వతి పరమేశ్వర సహిత వెంకటేశ్వర స్వామి వారి క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది, అనంతరం ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించడం జరిగింది, ఆమె ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలను అభినందిస్తూ తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ట్రస్టు ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ పూసపాటి బాలాజీ మరియు ఒంగోలు పట్టణ పుర ప్రముఖులు పాల్గొన్నారు