
జనం న్యూస్ ;5 ఫిబ్రవరి గురువారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై. రమేష్ ;
సిద్దిపేట ఎంఈఓ మరియు యూఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల చేతుల మీదుగా ప్రశ్నాపత్రాల విడుదల,భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. యుఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి గుడికందుల రవి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని సిద్దిపేటలోని ఇంద్రానగర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా సిద్దిపేట అర్బన్ మండల విద్యాధికారి రాజా ప్రభాకర్ రెడ్డి మరియు యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రవి హాజరై ప్రశ్నాపత్రాలను విడుదల చేశారు అనంతరం విద్యార్థులు ప్రతిభా పరీక్షలను రాయడం జరిగింది. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఏదైనా చేజారిన తర్వాతనే దాని విలువ అర్థమవుతుంది, కానీ అప్పటికే ఆ అవకాశం మనల్ని దాటి వెళ్ళిపోతుంది. అలానే ఈ సమాజంలో చాలామంది చదువును నిర్లక్ష్యం చేసి నేడు ఎంతో కష్టపడుతూ కూలి పనులు చేస్తూ జీవితం అనుభవిస్తున్నారు. అలాంటి వారందరూ వారి పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని చదివిస్తారు, ఆ విద్యార్థిగా ఉన్నప్పుడు ఎవరైతే రేపటి భవిష్యత్తు ముందే అర్థం చేసుకొని ఈరోజు పుస్తకం ముందు తలవంచి చదువుతారో వారే రేపటి రోజున గొప్ప గొప్ప పదవుల్లో ఉంటారు,వారు చెప్పే ప్రతి మాటకి ఈ సమాజం కూడా తలవంచుతుంది. విద్యార్థులైన మీరందరూ కూడా దానిని అర్థం చేసుకొని బాగా చదువుకోవాలని కోరుతున్నాను. దీనిలో ముఖ్యంగా మొదటి మెట్టైనా పదవ తరగతి పరీక్షలు ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో చాలా ముఖ్యమైన దశ. కాబట్టి దాన్ని చక్కగా చదివి రాస్తే భవిష్యత్తులో ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందడానికి ఈ పదవ తరగతి దోహదపడుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకొని పదవ తరగతి బోర్డు పరీక్షలకు ముందే ఈ టాలెంట్ టెస్ట్ ద్వారా మీరు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో తెలుసుకొని దాని మీద ఎక్కువ టైం కేటాయిస్తే రేపు జరగబోయే బోర్డు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. మీరందరూ రేపటి పౌరులు, మీ చేతిలోనే ఈ దేశ భవిష్యత్తు ఉంది కాబట్టి ఒక భగత్ సింగ్, అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే లాంటి సంఘసంస్కర్తలను మర్చిపోకుండా వారి యొక్క ఆశయాలను సాధించే విధంగా సమసమాజాన్ని స్థాపించడంలో మీరందరూ భాగస్వాములు అవ్వాలని ఆశిస్తున్నాను అని అన్నారు…
ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా నాయకులు ప్రవీణ్, హేమంత్, వినయ్ మరియు పట్టణ నాయకులు శంకర్, రాజు, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.