
జనం న్యూస్ 06 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం రూరల్ పోలీసు స్టేషన్ను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఫిబ్రవరి 5న ఆకస్మికంగా సందర్శించి, పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. వివిధ కేసుల్లో సీజ్ చేసి, పోలీసు స్టేషను ప్రాంగణంలో పార్కింగు చేసిన వాహనాలను నూతన చట్టాల్లోని నిబంధనల మేరకు డిస్పోజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం, పోలీసు స్టేషనులో పని చేసే పోలీసు సిబ్బందితో మమేకమై, వారి వివరాలను, సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.బాధితుల పట్ల ఆత్మీయత: స్టేషనుకు వచ్చే బాధితులు, వృద్ధులు, మహిళల పట్ల అప్యాయంగా మాట్లాడి, వారి సమస్యలను శ్రద్ధగా విని, పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. బాధితుల పట్ల సామరస్యంగాను, నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.స్టేషన్ సుందరీకరణ: పోలీసు స్టేషను పరిసరాలు ఆహ్లాదకరంగా, సుందరంగా ఉండాలని, ప్రాంగణాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలన్నారు.స్మార్ట్ పోలీసింగ్: అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు.భద్రత & నిఘా: పరిధిలో ఎక్కువ సిసి కెమెరాలు అమర్చాలని, జాతీయ రహదారిపై గస్తీ ముమ్మరం చేయాలని, ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.నేరాల నియంత్రణ: చట్టాన్ని ఉల్లంఘించే వారు, గంజాయి అక్రమ రవాణా చేసే వారు, మహిళలు మరియు బాలలపై అఘాయిత్యాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా ఉండాలని స్పష్టం చేశారు.రికార్డుల తనిఖీ: స్టేషనులోని రికార్డులు, సిడీ ఫైల్స్, హిస్టరీ షీట్లు, నాన్ బెయిలబుల్ వారంట్లను సమీక్షించి, తనిఖీ చేశారు. గంజాయి స్థావరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.అవగాహన కార్యక్రమాలు: మహిళలు, బాలలు, సైబర్ నేరాలు మరియు రహదారి భద్రత పట్ల ప్రజల్లో నిరంతరం చైతన్యం తీసుకురావాలన్నారు.తక్షణ స్పందన: డయల్ 100/112 ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, సంఘటనా స్థలానికి చేరుకోవాలని చెప్పారు.హెల్మెట్ తప్పనిసరి: ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాలని, పోలీసు సిబ్బంది కూడా విధిగా హెల్మెట్ ధరించాలని ఆదేశించారు.కానిస్టేబుళ్లకు అభినందన: సిసి కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి, వాటిని అమర్చుకొనేలా కృషి చేసిన కానిస్టేబుళ్ళు త్రినాధ్, సునీతలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
చివరగా, దర్యాప్తులో ఉన్న కేసుల డైరీలను పరిశీలించి, దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ దిశా నిర్దేశం చేశారు. ఈ తనిఖీల్లో ఎస్పీ వెంట డీఎస్పీ ఆర్.గోవిందరావు, రూరల్ సిఐ బి.లక్ష్మరావు, ఎస్బి సిఐ ఎ.వి.లీలారావు, ఎస్ఐ అశోక్ కుమార్ మరియు ఇతర సిబ్బంది ఉన్నారు.