
జనంన్యూస్. 06.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
సిరికొండలో "జాతీయ సార్వాత్రిక సమ్మె" నోటిస్ ఇచ్చిన కార్మికులు పోరాడితేనే హక్కులు సాధించుకుంటాం
టియుసిఐ రాష్ట్ర కార్యదర్శి ఆర్ రమేష్. ప్రధాని మోడీ కార్మికుల హక్కులను కార్పొరేట్లకు తాకట్టు పెట్టాడని, కేంద్రమరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడితేనే హక్కులు సాధించుకుంటాం అని ట్రేడ్ యూనియన్ సెంటర్ అప్ ఇండియా (టియుసిఐ) రాష్ట్ర కార్యదర్శి ఆర్ రమేష్ అన్నారు. సిరికొండ లో శుక్రవారం ఎంపివో తార చంద్ కు పిబ్రవరి 12నాడు జాతీయ కార్మిక,కర్శక, ప్రజాసంఘాలు తలపెట్టిన "జాతీయ సార్వాత్రిక సమ్మె" సబంధించిన సమ్మె నోటిస్ ను కార్మికులు కార్మికులు ఇచ్చిన సందర్బంగా టియుసిఐ రాష్ట్ర కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతు: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికులు రైతులపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తుందన్నారు. కార్పొరేట్ కంపెనీల ముందు సాగిలపడి దేశంలోని శ్రమజీవులను బలిపాశువులు చేస్తుందన్నారు. ప్రధాని మోడీ మత రాజకీయాలను చేస్తూ దేశమును శ్రమజీవులను కట్టు బానిసలుగా మార్చే కుట్రకు కోరుకుంటున్నారన్నారు. అందుకే కార్మిక వ్యతిరేక విధానాల అవలంబిస్తున్న ప్రధాని మోడి తీరుకు నిరసనగా జాతీయస్థాయి సార్వత్రిక సమ్మెను చేపట్టినట్లు ఆయన తెలియజేశారు. కేంద్రం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కార్మికుల కర్షకుల పుట్టగొట్టి పనులు మానుకోవాలి అన్నారు. లేకుంటే రాబోయే రోజుల్లో ఆయనకు తగిన బుద్ధి చెప్పాల్సివస్తుంది అని ఆయన హేచ్చరించారు.కార్యక్రమంలో టియుసియు నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లా సహాయకార్యదర్శి ఎం అనిస్, జిల్లా నాయకులు, ఎస్ కిశోర్, సిరికొండ మండల అధ్యక్షులు కే రాజన్న, మండల నాయకులు, శంకర్, బాలకిషన్, సలీం, గ్రామపంచాయతీ కార్మికులు,, కాశిరం, సుధాకర్, నరేష్. తదితరులు పాల్గొన్నారు.