
హస్తం గుర్తుకు ఓటెయ్యండి ధర్పల్లి కార్తిక సంతోష్
బిచ్కుంద ఫిబ్రవరి 6 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 3వ వార్డు పరిధిలోని బోయివాడ వాసులతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీ కాంతారావు గారు పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు..ఈ సందర్భంగా బోయివాడ వాసులు తమ ప్రాంతంలో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. కొంతమంది నాయకులు బోయివాడ వాసులను బెదిరిస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని, ఇలాంటి చర్యలను అసలు సహించేది లేదని అంటూ హెచ్చరించారు.బోయివాడ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.వార్డులోని ఇళ్ల సమస్య, డ్రైనేజీ, తాగునీటి సమస్యలతో పాటు ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు.ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో అందరూ ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గారు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు..

