
జనం న్యూస్ 07 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం రైల్వే స్టేషన్లో డార్మిటరీ, రిటైరింగ్ రూమ్ సదుపాయం శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా మాట్లాడుతూ… ప్రయాణికుల సౌకర్యం కోసం అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. కన్ఫర్మ్ అయిన పీఎన్ఆర్ ఉన్న ప్రయాణికులకే ఈ సదుపాయం లభిస్తుందన్నారు. బుకింగ్స్ అన్నీ ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో చేయాల్సి ఉంటుందన్నారు.