
బిచ్కుంద ఫిబ్రవరి 7 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారి అధ్యక్షతన ఉత్సాహభరితంగా జరిగింది.ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ నీలం మధు ముదిరాజ్ గారు, AICC కార్యదర్శి సచిన్ సావంత్ గారు, సభలో ప్రసంగించారు. ప్రజలను నేరుగా కలుసుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా డిసిసీ అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ గారు ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేస్తూ ముందుండి నాయకత్వం వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలను సమీకరించి ప్రచారాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.రోడ్ షోలో పాల్గొన్న నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా ప్రయోజన నిర్ణయాలను ప్రజలకు వివరించారు. ఇంటింటికీ చేరుకుంటూ పార్టీ విధానాలను తెలియజేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, మహిళలు, యువకులు భారీగా పాల్గొన్నారు. ప్రజల నుండి మంచి స్పందన లభించగా, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.


