
జనం న్యూస్ :వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ ఫిబ్రవరి 07 పెబ్బేరు శనివారం
పెబ్బేరు ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంమే దాస్తే దాగేది మాటల మూటలు కాదు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రగతి పురోగతి చరిత్రలో లిఖితం బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన బతుకమ్మ చీరలు పొలాల గట్టున రైతులు కంచెలుగా అమర్చారు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ చీరలు మహిళా ఆత్మగౌరానికి పత్రికపెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారంలో ఎమ్మెల్యే మేఘా రెడ్డి తో కలిసి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి పాల్గొని ప్రజలతో మాట్లాడారు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం పెబ్బేర్ మండల కేంద్రంలోని మున్సిపల్ 8 910 1112 వార్డుల్లో ప్రచారంలో పాల్గొని పర్యటించారు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు పదేండ్ల కాలంలో కల్లబొల్లి మాటలు చెప్పారు తప్ప డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదని ఆరోపించారు బిఆర్ఎస్ నిరంకుశ పాలనతో ప్రజలను అణిచివేసి తెలంగాణ వాదులు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి హింసించారన్నారు ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు బిఆర్ఎస్ పార్టీకి లేదన్నారు నిరుద్యోగులకు 3500 ఉద్యోగ భృతి దళితులకు మూడెకరాల భూమి వంటి అనేక హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ చెప్పిన హామీలతో బాకీ కార్డ్ పై తెలంగాణ సమాజం మాట్లాడితే బిఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పారన్నారు పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ పార్టీ చెయ్యని సంక్షేమ పథకాలు ప్రజా ప్రభుత్వంలో రేవంత్ సర్కార్ పనిచేస్తుందన్నారు వనపర్తి నియోజకవర్గం 3500 ఇండ్లు మంజూరు అయితే పెబ్బేరు మున్సిపాలిటీకి దాదాపుగా 600 పైచిలుకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన విషయాలను ప్రస్తావించారు పెబ్బేరు సంత గత ప్రభుత్వ హయాంలో కబ్జాలకు గురైన సందర్భాలను గుర్తు చేశారు 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరల ఇచ్చి మహిళ ఆత్మ గౌరవానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు సంక్షోభానికి గురయ్యారని కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు ఏండ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ నిబద్దతతో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పని చేస్తోంది అన్నారు జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో అన్ని వార్డులను గెలిపించుకొని మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని రాష్ట్రంలోనే వనపర్తి పెబ్బేర్ మున్సిపాలిటీలు ఆదర్శవంతంగా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు తో పాటు అక్కి శ్రీనివాస్ గౌడ్ పెబ్బేరు మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి ఉపాధ్యక్షుడు విజయవర్ధన్ రెడ్డి పెబ్బేరు పట్టణ మాజీ అధ్యక్షులు వెంకట్రాములు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీలత రంజిత్ కుమార్ దయాకర్ రెడ్డి గంధం రాజశేఖర్ సురేందర్ గౌడ్ రామచంద్ర రెడ్డి సాయిచరణ్ రెడ్డి, మణిగిల్ల తిరుపతిరెడ్డి యుగేందర్ రెడ్డి యాపర్ల రాంరెడ్డి గుమ్మడం వెంకటరామిరెడ్డి శ్రీహరి రాజు రాజశేఖర్ రెడ్డి పట్టణ మాజీ కౌన్సిలర్ మహిళలుయువకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు