
జనం న్యూస్ ఫిబ్రవరి 9, వికారాబాద్ జిల్లా
పరిగి మున్సిపల్ ఎన్నికలు ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎవరినీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించలేదని ఆయన స్పష్టం చేశారు.మా పార్టీ విధానం ప్రకారం ముందుగా మా కౌన్సిలర్ అభ్యర్థులందరూ గెలిచిన తర్వాత, సీనియర్ నాయకులంతా కలిసి చర్చించి, ఆలోచన చేసి అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకుంటామని తెలిపారు.