
జనం న్యూస్ ఫిబ్రవరి 09:
నిజామాబాద్ జిల్లాఏర్గట్లమండలవ్యవసాయ అధికారి వైష్ణవ్ 2020 నుండి 2023 సంవత్సరం వరకు వివిధ ఖరీఫ్ వరి స్థాపన వ్యవస్థలు మరియు సాగు పద్ధతుల తరువాతి శనగ, మినుములు, ఆవాల పంటలలో వేర్ల పెరుగుదల, నాట్లు వేయడం మరియు దిగుబడిపై ప్రభావం అనే అంశంపై చేసిన పరిశోధనలకు గాను ఆయనకు ఈ డాక్టరేట్ లభించింది.ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన 58వ స్నాతకోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారి చేతుల మీదుగా వైష్ణవ్ డాక్టరేట్ పట్టాను స్వీకరించారు.వ్యవసాయ రంగానికి ఉపయోగపడే ఈ పరిశోధన రైతులకు మేలు చేసే విధంగా ఉందని పలువురు ప్రశంసించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు, సహచరులు మరియు రైతులు వైష్ణవ్ ను అభినందించారు.
