
జనం న్యూస్ ఫిబ్రవరి 9 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా, చిలిప్చెడ్ మండలంలోని సోమక్కపేట గ్రామంలో గల జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారి విట్టల్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయం పరిపాలనకు ఉన్న ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు.విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రను పోషించి విద్యార్థులకు చక్కటి బోధన చేశారు కార్యక్రమంలో విద్యార్థులు స్వయం పరిపాలన అంశంపై ప్రసంగాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఈవోగా శ్రీలక్ష్మి , డిప్యూటీ డిఈఓ గా అన్వేష్ ఎంఈఓ గా శివాని ,ప్రధానోపాధ్యాయులుగా బాలాజీ ,ఉపాధ్యాయులుగా మణికంఠ ,విక్రమ్ ,నాగరాజు ,కృష్ణవేణి ,స్రవంతి ,నందిని ,అనిల్ ,వాసుదేవ్ ,మేఘన ,కరిష్మా ,పీఈటీగా దినేష్ రాహుల్ నవనీత సరిత తదితరులు ఉపాధ్యాయులుగా తమ పాత్ర నిర్వహించారు .ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విట్టల్ గారు ఉపాధ్యాయులు అజయ్ కుమార్ ,యాదగౌడ్ ,మోహన్ ,మహేష్ కుమార్ ,విజయ ,విష్ణువర్ధన్ ,రమాదేవి ,సంగీత విద్యార్థులు పాల్గొన్నారు