
జనం న్యూస్, ఫిబ్రవరి 09,అచ్యుతాపురం:
అచ్యుతాపురం అమూల్ డెయిరీ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందగా
మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అచ్యుతాపురం మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన అప్పికొండ
సాయి (21), రావాడ శ్రీను బైక్ పై వెళుతుండగా రాంగ్ రూట్లో వచ్చిన బొలెరో ఢీకొంది. ఈ ప్రమాదంలో
సాయి అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రంగా గాయపడిన శ్రీనుని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
