
జనం న్యూస్ 10 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
మెంటాడ మండలం పోరాంలో నివసిస్తున్న రెల్లి, దళిత కులస్థులకు భూమి పట్టాలు పంపిణీ చేయాలని అంబేడర్ పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద స్థానికులతో కలిసి సోమవారం నిరసన తెలిపారు. పోరాంలోని సర్వే నెంబర్ 126లో ఉన్న భూమికి వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబానికి ఐదు ఎకరాల భూమి పంపిణీ చేయాలన్నారు. గద్దె దిగుతారా… భూములు పంచుతారా? అంటూ నినాదాలు చేశారు.