జనం న్యూస్ 09 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ : జోగులాంబ గద్వాల్ జిల్లా రెండు సంవత్సరాలకు గాను ఆకర్షణీయమైన వడ్డీ రేటు గద్వాల్ తపాలా శాఖ సహాయ పర్యవేక్షకులు ఎల్ సైదా నాయక్ గద్వాల్ స్థానిక ప్రధాన తపాలా కార్యాలయంలో శనివారం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ (యం.యస్.యస్.సి) ఖాతాకు సంబంధించిన కర పత్రాలు మరియు గోడ పత్రికలను మహిళా ఉద్యోగి ఐనా కె.కళావతి పోస్ట్మాస్టర్ గద్వాల్ హెచ్.ఓ చేతుల మీదగా జారీ చేయడం జరిగిందని తపాలా శాఖ సహాయ పర్యవేక్షకులు సైదా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు . యం.యస్.యస్.సి ఖాతా 2023 సంవత్సరపు కేంద్ర బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త పొదుపు పథకం ప్రత్యేకంగా మహిళాల కోసం ప్రవేశపెట్టబడింది. ఈ పథకానికి కనీస పెట్టుబడి Rs 1000/- గరిష్టంగా Rs.200000/- (రెండు లక్షల) వరకు పెట్టుబడి చేసుకోవచ్చు. ఈ పథకానికి రెండు సంవత్సరాల పెట్టుబడి గాను ప్రస్తుత ఆకర్షణమైన వడ్డీ రేటు Rs.7.5 శాతం గా ఉన్నది. ఈ ఖాతా మహిళలకు రక్షణ కల్పించడం కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినది. కావున ఇట్టి ఖాతాలో మహిళలు ఖాతా తెరుచుటకు ఆఖరి తేదీ 31 మార్చ్ 2025 వరకు గడువు ఉన్నది. కావున మహిళా సోదరీమణులందరూ ఇట్టి తపాలా శాఖ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎల్.సైదా నాయక్ తపాల శాఖ సహాయ పర్యవేక్షకులు వారు ఒక ప్రకటనలో తెలియజేసినారు. ఈ యం.యస్.యస్.సి ఖాతా కరపత్రాలు గోడ పత్రికలు జారీ కార్యక్రమంలో మద్దమ్మ ఎంటీఎస్, బుజ్జి డాక్ సేవక్, రాజశేఖర్ పి.ఏ, బసంత్ రెడ్డి డి.పి యం, సుబ్రహ్మణ్యం పి.ఏ, ప్రశాంత్ పి.ఏ, మైసయ్య పి.ఏ, భాను ప్రసాద్ పి.ఏ, జగదీష్ డాక్ సేవక్, ఇస్మాయిల్ డాక్ సేవక్ గద్వాల్ ప్రధాన తపాలా కార్యాలయ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.చేయువారు డిపిఆర్ఓ జోగులాంబ గద్వాల జిల్లా.