
జనం న్యూస్ ఫిబ్రవరి 10 చిలిపిచేడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చండూరు గ్రామంలో గల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో" స్వయం పరిపాలన దినోత్సవం" సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు విష్ణు సార్ మరియు ఉపాధ్యాయులు ఈ స్వయం పరిపాలన దినోత్సవానికి ఉన్న ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గా రసూల్, డిఈఓ గా ధనుష్, ఎంఈఓ గా ఫాజిల్, ప్రధానోపాధ్యాయులుగా యుగేందర్, సిఆర్పి గా సురేష్ ఉపాధ్యాయులుగా మహేష్, అరుణ్, నితీష్, లావణ్య, లక్ష్మీ ప్రణతి తదితరులు తమ తమ పాత్రను అద్భుతంగా నిర్వహించారు. అనంతరం ఈరోజు యొక్క అనుభవాలను వారు చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు విష్ణు సార్ ఉపాధ్యాయులు ఉషారాణి, కవిత, ఫీబి,శశిధర్ గౌడ్, నర్సింలు, సలీమా గారులు మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.