
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 10 సెల్ 9550978955
చిలకలూరిపేట: పట్టణ మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు మంగళవారం నాడు పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్యాంటీన్ పరిసరాలను పరిశీలించిన ఆయన, గది ప్రాంతం అత్యంత పరిశుభ్రంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. క్యాంటీన్‌కు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు.
అనంతరం కమిషనర్ అక్కడ ఉన్న ప్రజలతో స్వయంగా మాట్లాడారు. ఆహారం నాణ్యత, రుచి ఎలా ఉంది? వడ్డింపు సరిగ్గా జరుగుతుందా అని అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్ నిర్వహణపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు.పారిశుద్ధ్య పనుల పరిశీలన అన్న క్యాంటీన్ తనిఖీ అనంతరం కమిషనర్ డివిజన్-1 పరిధిలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న పారిశుద్ధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డ్రైనేజీల క్లీనింగ్, చెత్త సేకరణ పకడ్బందీగా జరగాలని డివిజన్ వన్ సానిటరీ ఇన్స్పెక్టర్ కే వెంకటేశ్వర్లకు దిశానిర్దేశం చేశారు. వీరితోపాటు సచివాలయం సిబ్బంది, మేస్త్రీలు పారిశుద్ధ కార్మికులు తదితరులు ఉన్నారు.