
జనం న్యూస్, ఫిబ్రవరి 10, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి :
జిల్లా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (NCD) ప్రోగ్రామ్ అధికారి డా. రాజేందర్ రెడ్డి జగ్గసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అధికారికంగా తని చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో సంబంధిత మెడికల్ ఆఫీసర్లు డా. ఎల్లాల అంజిత్ రెడ్డి మరియు డా. టి. శివానీ పాల్గొన్నారు.తనిఖీ సందర్భంగా NCD కార్యక్రమానికి సంబంధించిన అన్ని రిజిస్టర్లు, రికార్డులు మరియు ఇతర జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు పరామితులను ఆయన సవివరంగా పరిశీలించారు. హైపర్టెన్షన్, డయాబెటిస్ స్క్రీనింగ్, కేసుల నమోదు, ఫాలోఅప్ విధానం, రిఫరల్ సేవలు, ఔషధాల నిల్వ మరియు వినియోగం వంటి అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు మరియు ప్రామాణిక కార్యాచరణ విధానాల (SOPs) ప్రకారం అన్ని ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేయాలని, రికార్డుల నిర్వహణలో ఖచ్చితత్వం మరియు పారదర్శకత పాటించాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన, నిరంతర వైద్య సేవలు అందేలా బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు.