
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 10 సెల్ 9550978955
రూ.52 లక్షలతో మూడు వార్డుల్లో నిర్మించనున్న సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మాజీమంత్రి.
2014-19లో పట్టణంలో ఎక్కడా మట్టి రోడ్డు అనేది లేకుండా సీసీ రోడ్లు నిర్మించామని, భవిష్యత్ లో నివాసాలు విస్తరించే మారుమూల ప్రాంతాల్లో కూడా సీసీ రోడ్లు వేయించామని, నాడు పట్టణ ప్రజలు కోరిన విధంగా అన్ని రకాల అభివృద్ధి పనులు పూర్తి చేయించినట్టు మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలియచేశారు. పట్టణంలోని 12, 17 వార్డుల్లో రూ.32 లక్షలతో చేపట్టిన సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులు, 14వ వార్డుల్లో రూ.20 లక్షలతో నిర్మించనున్న డ్ర్రైన్ల పనులకు మంగళవారం ఆయన కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు.అనంతరం మీడియాతో మాట్లలాడారు. 12 వార్డులో 43 సంవత్సరాల క్రితం నిర్మించిన రోడ్డు పూర్తిగా కుంగిపోవడంతో కొత్తగా సీసీ రోడ్డు నిర్మాణం, డ్రైన్లు, తాగునీటి వాటర్ లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. మొత్తం రూ.52 లక్షలతో ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి ప్రజల ఛిరకాలకోరిక నెరవేర్చామని నెలరోజుల్లో మొత్తం పనులు పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారుకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు ప్రత్తిపాటి తెలియచేశారు.రూ.5 కోట్ల ప్రత్యేక నిధులతో పట్టణంలో అభివృద్ధి పనులు పట్టణంలో అభివృద్ధి పనులకు గాను పురపాలక శాఖ మంత్రి నారాయణ రూ.5 కోట్ల ప్రత్యేక జనరల్ ఫండ్ కేటాయించారని, ఆ నిధులతో రోడ్లు..డ్రైన్ల నిర్మాణం, తాగునీటి సరఫరా ఇతర మౌలిక వసతుల కల్పన పనులు పూర్తిచేస్తున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూటమిప్రభుత్వంలో సకాలంలో వారి సమస్యలు పరిష్కారమవుతున్నాయని ప్రత్తిపాటి తెలిపారు.గతంలో టీడీపీ ప్రభుత్వంలోనే పట్టణ వ్యాప్తంగా రోడ్లు, డ్రైయిన్లు, కమ్యూనిటీ భవనాలు, పాఠశాలలు, తాగునీటి సరఫరా వంటి అభివృద్ధి పనుల్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేసినట్టు ఆయన చెప్పారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎక్కడా ఒక్క చిన్న ఇటుక కూడా వేసింది లేదన్నారు.కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, డీఈ అబ్దుల్ రహీమ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, జిల్లా నాయకులు బత్తినేని శ్రీనివాసరావు, అమరా రమాదేవి, జారినా సుల్తానా, టీడీపీ నాయకులు బేరింగ్ మౌలాలి, మద్దిబోయిన శివ, ముల్లా కరీముల్లా, సయ్యద్ వహబ్, మురకొండ మల్లిబాబు, గట్టినేని విజయ్ సాయి, షేక్ బాజీ, పిల్లి లెనిన్, గెరా రాము, గట్టుపల్లి మాణిక్యారావు, పిల్లి ధనలక్ష్మి, షేక్ బారి, షేక్ బాజీ, బీడింగ్ కరీముల్లా, పుల్లగూర భరత్, చింతకాయల కోటి, వార్డు నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.