జనం న్యూస్ //ఫిబ్రవరి //9//జమ్మికుంట //కుమార్ యాదవ్.. జమ్మికుంటలోని వైద్య బృంద విద్యారణ్య ఆవాస విద్యాలయంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా వైద్య బృందమంతా విద్యార్థులను పరిశీలించి ఆరోగ్య రక్షణకు తగిన సూచనలు ఇచ్చి, అలాగే అవసరమైన మెడిసిన్ అందించడం జరిగింది.ఆవాస పాఠశాల సమితి అధ్యక్షులు,చిట్టి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి చొరవతో ఈ వైద్య బృందమంతా పాల్గొని విద్యార్థులకు మెడికల్ క్యాంపు నిర్వహించినందుకు పాఠశాల తరఫున వైద్య బృందానికి , పోల్సాని సుధాకర్ రావు విలేకరుల సమావేశంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.