
జనం న్యూస్ 11 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం నియోజకవర్గం వైసీపీ నాయకులతో మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి అధ్యక్షతన మన కార్యకర్త-మన కుటుంబం కార్యక్రమం మంగళవారం జరిగింది. రాష్ట్ర వైసీపీ కార్యదర్శి, విజయనగరం, రాజాం నియోజకవర్గ పరిశీలకుడు కే.వి సూర్యనారాయణ రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణ, అనుబంధ కమిటీలను సమన్వయంతో వేగంగా పూర్తి చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని వారు సూచించారు.