
జనంన్యూస్. 12.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
తెలంగాణ ఉద్యమ కారుడు ప్రియతమ నాయకుడు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి జన్మదిన వేడుకలు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించిన స్థానిక కార్యకర్తలు .అన్ని గ్రామాల్లో ప్రధాన కూడళ్ళ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ చౌరస్తా వద్ద మండల అధ్యక్షులు బకారం రవి ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే భూపతి రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని,రాజకీయంగా మరెంతో ఉన్నత స్థితికి చేరాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండల. సర్పంచులు. ఉపసర్పంచ్ లు. కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
