
జనం న్యూస్ 12 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల జిల్లా పాతబస్తాండ్ సమీపంలో నిర్వహించిన లేబర్ కోడ్స్, వి.బి. రామ్జీ చట్టం, జాతీయ విత్తన చట్టం, విద్యుత్ సవరణ బిల్లుల రద్దునకు మద్దతు తెలిపిన జోగులాంబ గద్వాల జిల్లా డిసిసి అధ్యకులు శ్రీ రాజీవ్ రెడ్డి 12-02-2026 న నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో జిల్లా అధ్యక్షులు రాజీవ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాపాడటంలో పూర్తిగా విఫలమై, కార్మిక వ్యతిరేక విధానాలతో చట్టాలను అమలు చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. కార్మికుల ఉపాధి, భద్రత, జీవనాధారాలను దెబ్బతీసేలా తీసుకొచ్చిన లేబర్ కోడ్స్, ఉపాధి హామీ కూలీలకు నష్టం కలిగించే వి.బి. జీ రామ్జీ చట్టం, రైతు వ్యతిరేక జాతీయ విత్తన చట్టం, విద్యుత్ సవరణ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కార్మికులు,కార్మిక సంఘాలు,నాయకులు, పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెకు మద్దతు తెలిపారు.
