
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 12 సెల్ 9550978955
మేనిఫెస్టో హామీల అమలు కోరుతూ ఎస్ టి యు తలపెట్టిన మూడు దశల పోరాటంలో భాగంగా రెండో దశ కలెక్టరేట్ వద్ద ధర్నా రేపు అనగాది:13-02-2026 న ఉదయం 9.30 గం|| లకు పల్నాడు జిల్లా కేంద్రంలోని నరసరావుపేట పట్టణం ధర్నా చౌక్ ల(గాంధీ పార్క్ ), రైల్వే స్టేషన్ రోడ్ నందు జరుగును. కావున జిల్లా పల్నాడు జిల్లా పరిధిలోని రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కౌన్సిలర్లు, అన్ని మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్థిక కార్యదర్శులు, గౌరవాధ్యక్షులు,మండల కార్యవర్గ సభ్యులు,ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు,ఎస్ టి యు నాయకులు పెన్షనర్లు తప్పనిసరిగా అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్ టి యు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె కోటేశ్వరరావు రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు కోరారు, చిలకలూరిపేట పట్టణంలోని ఎస్టియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పిఆర్సి కమిషన్ నియమించాలని 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని పెండింగ్లో ఉన్న 32 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయులపై బోధ నేత్ర భారం తగ్గించాలని ప్రధాన డిమాండ్ లో జరిగే ధర్నాలు ప్రతి ఒక్కరు తప్పక పాల్గొనాలని తెలిపారు
మన సంఖ్యాబలం మాత్రమే మన డిమాండ్లను నెరవేరుస్తాయి ,కావున మనమందరం రేపటి ధర్నాలో పాల్గొందాం.మన న్యాయపరమైన డిమాండ్లను, ఆర్థిక అంశాలను సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ భాద్యత గా మెలిగి గుర్తేరగాలని కోరారు. సమావేశంలో పట్టణ అధ్యక్షులు మేకల కోటేశ్వరావు పట్టణ ప్రధాన ప్రధాన కార్యదర్శి వడ్లన జయప్రకాష్ ప్రాంతీయ శాఖల బాధ్యులు పాల్గొన్నారు