
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.
కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం పాటూరు గ్రామ పంచాయతీ పరిధిలో వైకే పల్లి నుండి నాగిరెడ్డిపల్లె వరకు దాదాపు 40 లక్షల రూపా యలతో నూతన సిమెంటు రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం ఆయన ప్రారం భించారు. ఈ రోడ్డు నిర్మాణానికి రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో నంద లూరు మండలంలో నాగిరెడ్డిపల్లి, పాటూరు పంచాయితీల్లో దాదాపుగా కోటి రూపాయల పైన నిధులు మంజూరు చేసి ఈ ప్రాంత ప్రజల చిరకాల కలను నెరవేర్చిన యల్లటూరు శ్రీనివాస రాజు గారికి ఆ ప్రాంత ప్రజలు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.
ఎన్నోసంవత్సరాలుగా నాలుగు ప్రాంతాల ప్రజలు ఎదురుచూస్తున్న ఈ సిమెంట్ రోడ్డు నిర్మాణం జరగడంతో ఆ ప్రాంత రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కోటి రూపాయలు నిధుల్లోభాగంగా 40 లక్షల రూపాయలతో ఈరోజు రహదారి నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఇంజనీర్లు, మాజీ జెడ్పిటిసి సభ్యులు షబ్బీర్ అహ్మద్, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, కాంట్రాక్టర్ యల్లటూరు వినోద్ కుమార్ రాజు యల్లటూరు సుబ్బరాజురామకృష్ణంరాజు మరియు గ్రామస్తులు, రైతులు, ప్రజలు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
