
జనం న్యూస్ ఫిబ్రవరి 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశాఖ, మరియు మలేరియా డిపార్ట్మెంట్ ప్రభుత్వం నిర్దేశించిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని 81వ వార్డులో అగ్గిమరిచెట్టు వీధిలో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి శ్రీ భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయని, వాటిని అరికట్టడానికి తీసుకోవలసిన ఆరోగ్య సూత్రాలను పాటించాలని, ముఖ్యంగా దోమకాటు నివారణ చేయడానికి తీసుకోవలసిన చర్యలపై జీవీఎంసీ పారిశుధ్య కార్మికులు, మరియు సేవా సదన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి సత్యనారాయణ మాట్లాడుతూ, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరూ సుచి శుభ్రతను పాటించినప్పుడు అనారోగ్యాలు రాకుండా ఉంటాయని, కాలువలో మురుగునీరు నిల్వ ఉండకుండా, కొబ్బరికాయలు ప్లాస్టిక్ ఒంటి వస్తువులు కాలువలో వేయకుండా జాగ్రత్తలు పాటించాలని సత్యనారాయణ తెలియజేశారు.మలేరియా ఇన్స్పెక్టర్ కోదండ రాము మాట్లాడుతూ రెండు రకాల దోమలు కుడితే హానికరమని మలేరియా వంటి వ్యాధులు ప్రబలతాయని, బోదకాలు వంటి వ్యాధులు వస్తాయి అని కోదండ రాము అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ అప్పలరాజు 81వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ ఆడారి సంతోష్ శానిటేషన్ సెక్రటరీలు ఏఎన్ఎంలు, సేవాసదన్ నాయకులు కొణతాల ఆది నాగేశ్వరరావు కొణతాల కారు బాబు కాండ్రేగుల వెంకట వీర అప్పారావు కాండ్రేగుల మంగ కాండ్రేగుల లక్ష్మి పాల్గొన్నారు.//