
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 13 సెల్ 9550978955
పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఐపీఎస్
ట్రాఫిక్ రూల్స్ డైవర్షన్
రాష్ట్ర పండుగ హోదా కలిగిన కోటప్పకొండ తిరునాళ్ళ కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుండి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి కూడా భక్తులు త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తూ వుంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చే వారు త్రికొటేశ్వర స్వామి వారిని స్వేచ్చగా దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళడానికి పోలీస్ శాఖ తరపున ఈ క్రింది ట్రాఫిక్ నిబంధనలు మరియు డైవర్షన్లను తెలియజేశారు..
నరసరావుపేట వైపు నుండి వినుకొండ నుండి కోటప్పకొండ కు వచ్చు వాహనదారులు
నరసరావుపేట నుండి వినుకొండ నుండి కోటప్పకొండ కు వచ్చు భక్తులు పెట్లూరివారి పాలెం దగ్గర కోటప్పకొండ రూట్లోకి ఎంటర్ అయ్యి అచ్చమ్మ పాలెం దాటిన తరువాత కుడి వైపు ఏర్పాటుచేసిన పార్కింగ్ ప్రదేశమునకు చేరుకొని క్రమ పద్ధతిలో వాహనాలను పార్క్ చేసుకొనవలెను. ఎలమంద గురువాయపాలెం, గోనేపూడి, చింతలపాలెం నుండి వచ్చు వాహనదారులు స్నానాల ఘాటు వద్ద ఉన్నటువంటి ఐరన్ బ్రిడ్జి మీదుగా వెళ్లి యాదవుల సత్రం ప్రక్కన ఉన్న పార్కింగ్ ప్రదేశంలో వాహనాలను పార్క్ చేసుకొనవలెను చిలకలూరిపేట వైపు నుండి కోటప్పకొండకు వచ్చు వాహనదారులు చిలకలూరిపేట మీదుగా వచ్చు భక్తులు చిలకలూరిపేట, పురుషోత్తమ పట్నం, ఎడవల్లి, UT జంక్షన్ మరియు తర్వాత ఉన్నటువంటి శారదా ఫార్మసీ కాలేజ్ వద్ద ఏర్పాటుచేసిన పార్కింగ్ ప్రదేశంలో పార్కింగ్ ప్రదేశంలో వాహనాలను పార్కు చేసుకొనవలెను.చిలకలూరిపేట వైపు నుండి వచ్చే వారికి శారదా ఫార్మసీ కాలేజ్ దగ్గరలో RTC బస్టాండ్ ఏర్పాటు చేయబడి ఉన్నది తిరుగు ప్రయాణం వెళ్ళు వారు అక్కడి వరకు నడిచి వెళ్లి అక్కడినుండి బస్సుల ద్వారా చిలకలూరిపేట చేరుకొనవలెను.చిలకలూరిపేట వైపు నుండి ట్రాక్టర్లు మరియు కార్లలో వచ్చు భక్తులు సాయంత్రం 4 గంటల తర్వాత ఎడవల్లి దగ్గర ఉన్నటువంటి అట్టల ఫ్యాక్టరీ రోడ్డు గూండా కట్టుబడి వారి పాలెం మీదుగా నిధికి చేరుకోవాలి.అదేవిధంగా కోమటినేని వారి పాలెం కమ్మవారిపాలెం నుంచి వచ్చే వాహనాలు కట్టుబడి వారి పాలెం మీదుగా నిధికి చేరుకోవాలి.కోటప్పకొండ టోల్గేట్ దగ్గరలో ఏర్పాటు చేసినటువంటి షటిల్ బస్సుల ద్వారా మాత్రమే భక్తులు కొండకు చేరుకోవాలి.కొండపైకి ఎటువంటి ద్విచక్ర వాహనాలు మరియు కార్లు అనుమతించబడవు.ప్రభలకు సంబంధించి నరసరావుపేట మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చేటువంటి మొక్కుబడి ప్రభలు 15వ తేదీ పగలు ముందుగా బయలుదేరి ఎలమంద గ్రామం మీదుగా స్నానాల ఘాట్, యాదవుల సత్రం మీదుగా రెడ్ల సత్రం పక్కన ఉన్నటువంటి వారికి కేటాయించిన ప్రదేశానికి రాత్రి 8 గంటల లోపు చేరుకొని ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ప్రజలకు మరియు పోలీసు వారికి సహకరించాలి పెట్లూరి వారి పాలెం, కాకాని నుండి వచ్చు ప్రభలు AM రెడ్డి కాలేజీ దగ్గర NSP కెనాల్ రోడ్డు మార్గం ద్వారా జాగ్రత్తగా ప్రభల హాల్టింగ్ ప్రదేశానికి చేరుకోవాలి.ఆ సమయంలో పెట్లూరి వారి పాలెం నుండి AM రెడ్డి కాలేజీ వరకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసు వారికి సహకరించాలి.ఇప్పటివరకు మొత్తం 29 (26 ఎలక్ట్రికల్ ప్రభలు, 3 నాన్ ఎలక్ట్రికల్ ప్రభలు (పెద్దవి)) వాటితో పాటు 49 నాన్ ఎలక్ట్రికల్ చిన్న ప్రభలు మరియు 100 పైగా మొక్కుబడి ప్రభలు వస్తూ ఉన్నవి.ఈ సందర్భంగా ప్రభల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆర్గనైజర్స్ ను సంబంధిత MRO వద్ద బైండోవర్ చేయడం జరిగింది.ఒకవేళ బైండోవర్ ఉల్లంఘన జరిగినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడును.ప్రభల పైన తిరునాళ్ల సందర్భంగా వేసే నృత్యాలలో అశ్లీలతకు చోటు లేకుండా ఆర్కెస్ట్రా టీమ్స్ ను కూడా బైండోవర్ చేయడం జరిగింది.తిరునాళ్ల సందర్భంగా కోటప్పకొండకు వచ్చు భక్తుల సౌకర్యార్థందొంగతనాలు, మహిళల ను ఇబ్బంది పెట్టాలి అని చూసే వారిని కట్టడి చేయడానికి అన్నిచోట్ల మఫ్టీలో (సాధారణ దుస్తులలో) క్రైమ్ టీమ్స్ ను నియమించడం జరిగింది.మెట్ల మార్గంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఉండటానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.స్నానాల ఘాట్ వద్ద భక్తులు చిన్నపిల్లల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకొనవలెను కోటప్పకొండ తిరుణాల సందర్భంగా కోటప్పకొండకు వచ్చు అన్ని మార్గాలు, పార్కింగ్ ప్రదేశాలు, క్యూ లైన్స్ అన్నింటిని 200 CC కెమెరాలు, 30 డ్రోన్స్ తో కవర్ చేస్తూ కొండపైన 1 కంట్రోల్ రూమ్, కొండ క్రింద 1 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సమన్వయం చేయడం జరుగుతుంది.తిరునాళ్లకు వచ్చు భక్తులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ తప్పిపోయినట్లయితే కొండ క్రింది నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ఏర్పాటుచేసిన పోలీసు అవుట్ పోస్టు వద్ద కానీ, కొండ పైన రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్టు వద్ద కానీ లేదా మీరు ఉన్నచోట నుండి మీ దగ్గరలో ఉన్న ఏ పోలీసు వారికైనా తెలియపరిచినట్లయితే సంబంధిత వ్యక్తి వివరాలు కంట్రోల్ రూమ్ ద్వారా డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులకు తెలియపరచడం జరుగుతుంది.తిరునాళ్లకు హాజరు అయ్యే భక్తులకు ఏమైనా ఇబ్బంది కలిగినట్లయితే పోలీసు వారు తెలిపిన 9440900885 నెంబర్ కు తెలపవలెను.కోటప్పకొండ తిరునాళ్ళు సందర్భంగా తిరునాళ్లు ప్రశాంతంగా జరగడానికి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునే విధంగా, ప్రభల వద్ద మరియు ఇతర ప్రదేశాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను సుమారు 2,500 మంది పోలీసు అధికారులు, సిబ్బంది మరియు 9 ప్లటూన్ ల ప్రత్యేక పోలీసు బలగాలతో (మొత్తం సుమారు 3,000 మందితో) పోలీసు బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది.తిరునాళ్లు ముగిసిన తర్వాత భక్తులు అందరూ వారి వాహనాలను వారికి కేటాయించినటువంటి రోడ్డు మార్గాన మాత్రమే వెళ్ళవలెను వ్యతిరేక మార్గాలలో వెళ్లి ట్రాఫిక్ జామ్ కావడానికి కారకులు కారాదు.అంతేకాకుండా పల్నాడు జిల్లాలోని ఇతర శైవ క్షేత్రాలు అయిన అమరావతి, గుత్తికొండ బిలం, దైద బిలం, సత్రశాల, ఏలేశ్వరం గట్టు, గోగులపాడు, మన్నేపల్లి తండా,సంజీవకొండ, వినుకొండ మరియు లింగంగుంట్ల (పెదకూరపాడు)లో కూడా ప్రత్యేకంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.కావున ప్రజలందరూ దర్శనానికి వెళ్లేటప్పుడు కానీ, బస్సులు ఎక్కేటప్పుడు కానీ, తిరునాళ్లు చూసేటప్పుడు కానీ, రోడ్ల మీద నడిచేటప్పుడు,రద్దీ సమయాలలో పార్కింగ్ ప్రదేశాలలో కానీ సంయమనం పాటిస్తూ పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాము.