
జనం న్యూస్ 14 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
కౌంటింగ్ కేంద్రం దగ్గర బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి, ధర్నా చేసిన స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి డా. అంజనేయ గౌడ్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్.కేశవ్ ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని గొనుపాడు చివరలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన మున్సిపాల్ ఎన్నికల కౌంటింగ్ లో బి ఆర్ యస్ పార్టీ అభ్యర్థులు 8,23వ వార్డులలో 4 సార్లు రీ కౌంటింగ్ నిర్వహిస్తున్నారని బి ఆర్ యస్ పార్టీ నాయకులతో కలిసి,పోలింగ్ ఎదుట రోడ్డుపై బఠాయించి ధర్నా చేశారు.. ఈ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఆర్ ఓ పై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాల చేశారు…ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రీ కౌంటింగ్ తో ఎమ్మెల్యే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు..గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థులకు గెలిచినట్లు ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా పదేపదే రీకౌంటింగ్ జరపడం రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు.కౌంటింగ్ సెంటర్లో బిఆర్ఎస్ అభ్యర్థులను తక్షణమే బయటికి పంపించకపోతే జిల్లా బందుకు పిలుపునిస్తామని హెచ్చరించారు…..
ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి, జి.రాఘవేంద్ర రెడ్డి, బీచుపల్లి, నరసింహులు,మోనేష్,హరి,శేఖర్ నాయుడు,తిరుమలేష్,ఎండి.మాజ్,పూడూరు రఘు,గోవిందు,తిమ్మప్ప గౌడ్,రాజు, వీరేష్ , రాము, రవి,కృష్ణ , మోహన్ మరియు పార్టీ నాయకులు , కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు….