
జనంన్యూస్. 14.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాద్ కార్పొరేషన్ లో ఊహించినట్టుగానే పూర్తి మెజారిటీ ఎవరికి రాకపోవడం వలన కాంగ్రెస్. బిజెపి మధ్య నువ్వా నేనా అనే ఆసక్తికర ఫోరు. పార్టీల బలబలాలు ఈ విధంగా ఉన్నవి .నిజామాబాద్ కార్పొరేటర్లు: 60
ఎక్స్ ఆఫిషియోలు: 07 మొత్తం మొత్తం: 67.కాబట్టి, 67లో మేయర్ అభ్యర్థికి 34 ఓట్లు అవసరం.బీజేపీ కార్పొరేటర్లు: 28 బీజేపీ ఎక్స్ ఆఫిషియోలు: 05 మొత్తం: 33 అందువల్ల బీజేపీకి ఒక ఓటు (34–33) తక్కువగా ఉంది. కాంగ్రెస్ కార్పొరేటర్లు: 17 ఏఐఎంఐఎం కార్పొరేటర్లు: 14 కాంగ్రెస్ ఎక్స్ ఆఫిషియోలు: 02
మొత్తం: 33 కాంగ్రెస్‌కూ ఒక ఓటు (34–33) తక్కువగా ఉంది. బీఆర్ఎస్ కార్పొరేటర్: 01
కాబట్టి, బీఆర్ఎస్ కార్పొరేటర్ నిర్ణయాత్మక పాత్ర పోషించి, మేయర్ అభ్యర్థిని నిర్ణయిస్తాడు.
మొత్తం ఓట్లు: 67 బీజేపీ: 33 కాంగ్రెస్ & ఏఐఎంఐఎం: 33 బీఆర్ఎస్: 01. ఇప్పటివరకు ఉన్నా సమాచారం మేరకు. బి ఆర్ ఎస్ అభ్యర్థి 37 వ డివిజన్ కార్పొరేటరు విజయలక్ష్మి కాంగ్రెస్ శిబిరం లో ఉన్నట్టు వినికిడి.