
జనం న్యూస్ మామిడి రవి శాయంపేట మండలం రిపోర్టర్ శాయంపేట మండల
కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు.15వ తేదీ ఆదివారం ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ ప్రధమ రుద్రాభిషేకం ఆరు గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అభిషేకాలు పూజలు నిర్వహిస్తామని రాత్రి 9:30 గంటలకు శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తామని రాత్రి 12 గంటలకు లింగోద్భవ పూజ శివపార్వతుల పంచులోహ విగ్రహాల ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు