
జనం న్యూస్ ఫిబ్రవరి 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామం నుండి బొజ్జన్న కొండకు వెళ్లే ప్రధాన రహదారి కి మరమ్మత్తులు చేపట్టాలని రహదారి మీద చెరువులను తలపిస్తున్న గోతులను వెంటనే పుడ్చాలని బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్చార్జ్ సూదికొండ మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. పార్టీ నేతలు వనమాల నాగభూషణం వెంకటరమణ మరియు ఫోరమ్ పర్ సోషల్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు కొల్లి చిన్నప్పారావు తదితరులతో కలిసి ఆయన రహదారి మీద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సూదికొండ మాణిక్యాలరావు మాట్లాడుతూ తుమ్మపాల గ్రామం నుండి ప్రముఖ పర్యాటక క్షేత్రమైన బొజ్జన్న కొండకు వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నదని రహదారి మీద ఉన్న గోతులు చెరువులను తలపించే విధంగా ఉన్నాయని వీటి వలన ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పలువురు గాయాల పాలు అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి రహదారి మీద ప్రమాదకరంగా ఉన్న గోతులను పూడ్చాలని తూతూ మంత్రంగా కాకుండా పటిష్టంగా పూర్తిస్థాయిలో పదికాలాలపాటు ఉండేలా రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. రహదారి ఎన్నిసార్లు నిర్మాణం చేపట్టినప్పటికీ ఇదేవిధంగా గోతులు పడుతున్నదని కొందరు చెప్పడం జరిగిందన్నారు దీనికి కారణం ఏమిటి అన్నది అందరూ ఆలోచన చేయాలన్నారు నిబంధనలకు విరుద్ధంగా వివిధ క్వారీల నుండి అత్యధిక బరువుతో వెళుతున్న క్వారీ లారీలు వలన ఇంత నష్టం జరుగుతున్నప్పుడు వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఆయన ప్రశ్నించారు పాలకులకు అధికారులకు ప్రజలు వారి ఎదుర్కొంటున్న సమస్యల కంటే క్వారీ యజమానులే ఎక్కువ అవుతున్నారా అని ఆయన ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫోరం ఫర్ సోషల్ రైట్స్ జిల్లా అధ్యక్షులు కొల్లిచిన అప్పారావు మాట్లాడుతూ అధికారులు పాలకులు ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత నష్టం జరిగిన తర్వాత హడావుడి చేయడం కాకుండా ముందుగానే ఎటువంటి నష్టం జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు.//