
జనం న్యూస్ ఫిబ్రవరి 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలోని శ్రీ రాజ రాజేశ్వరి స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం రాత్రి శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి వేద మంత్రాల మధ్య వైభవంగా నిర్వహించినారు. దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి రాజమణి దంపతులు పట్టు వస్త్రాలు తలంబ్రాలను మంగళ వాయిద్యాల మధ్య తీసుకువచ్చి స్వామివారి కళ్యాణానికి అందజేసినారు. కళ్యాణ అనంతరం అర్ధరాత్రి శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ప్రతిష్టించి భజనలతో నృత్యాలు చేస్తూ గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు. ప్రజలు స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి మంగళ హారతులు ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...