
మెట్పల్లి రాజకీయాల్లో సంచలనం బీజేపీ కౌన్సిలర్ చెట్లపల్లి మీనా సుఖేందర్ గౌడ్‌ను సస్పెండ్ చేసిన బీజేపీ పార్టీ
జనం న్యూస్, ఫిబ్రవరి 16, జగిత్యాల జిల్లా,
మెట్ పల్లి : మెట్పల్లి పట్టణంలో మున్సిపాలిటీలో పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేసినందుకు బీజేపీ కౌన్సిలర్ చెట్లపల్లి మీనా సుఖేందర్ గౌడ్‌ను పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసింది. చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా జారీ చేసిన విప్‌ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి.విప్‌కు విరుద్ధంగా ఓటు ని చైర్పర్సన్ ఎన్నికలో పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వకుండా, వ్యతిరేకంగా ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ కి పట్టం కట్టారని సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ శాసన ప్రక్రియను పాటించలేదని భావించిన నాయకత్వం క్రమశిక్షణ చర్యలకు దిగింది.పార్టీ క్రమశిక్షణ చర్యఈ ఘటనపై స్పందించిన స్థానిక నాయకులు, పార్టీ నియమాలు అందరికీ సమానమని స్పష్టం చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘనపై తక్షణమే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.రాజకీయ వర్గాల్లో చర్చఈ సస్పెన్షన్‌తో మెట్పల్లి మున్సిపల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే చైర్పర్సన్ ఎన్నిక చుట్టూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది, బీజేపీ పార్టీ తరపున పది మంది కౌన్సిలర్లు గెలుపొందిన చైర్మన్ పదవి మాత్రం కాంగ్రెస్ కు దక్కింది