
జనం న్యూస్ 16 ఫిబ్రవరి ఘట్కేసర్ ప్రతినిధి
:మేడ్చల్ జిల్లా పోచారం లో కొలువైన స్పటిక లింగేశ్వర ఆలయం మహాశివరాత్రి సందర్భంగా మహాశివుడు దర్శనార్థం వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణకు 20వేల రూపాయలను ఆలయ కమిటీకి గ్రేటర్ హైదరాబాద్ బీసీ సంఘం వైస్ ప్రెసిడెంట్ కే సతీష్ కుమార్, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా పోచారం లో నిర్వహిస్తున్న మహా అన్నదాన వితరణ కార్యక్రమానికి నా వంతుగా 20వేల రూపాయలను చందాగా ఇవ్వడం నా మనసుకి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు, ఆ మహా శివుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్నానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలోమెట్టు బాల్రెడ్డి,శ్యామల బుచ్చిరెడ్డి, బద్దం నరసింహారెడ్డి, మెట్టు నరసింహారెడ్డి, నరేష్ గౌడ్, యాది ముదిరాజ్, అనిల్, రఘు మరియు స్పటిక లింగేశ్వర ఆలయం కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
