
జనం న్యూస్ 17 ఫిబ్రవరి
జహీరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. 15వ వార్డు కౌన్సిలర్ యూనుస్ ఛైర్మన్ గా, 16వ వార్డు కౌన్సిలర్ కొత్తకాపు శిరీష రెడ్డి వైస్ ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంఐఎం, ఇండిపెండెంట్ కౌన్సిలర్ల మద్దతుతో కాంగ్రెస్కు మెజారిటీ లభించింది. ఆర్డీవో దేవుజా సమక్షంలో నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.