
జుక్కల్ ఫిబ్రవరి 17 జనం న్యూస్
తెలంగాణ రాష్ట్ర ప్రదాత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ 72వ జన్మదిన వేడుకలు సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు శ్రీ హనుమంత్ షిండే ఆదేశాలతో మంగళవారం రోజు జుక్కల్ మండల అంబేద్కర్ చౌరస్తా నందు మండల అధ్యక్షుడు గంగాధర్ కేక్ కట్ చేసి కార్యకర్తలను ఒకరినొకరు స్వీట్ తినిపించారు అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ లో పేషెంట్లకు పండ్ల పంపిణీ కార్యక్రమం (BRS )బి ఆర్ఎస్ పార్టీ జుక్కల్ మండల అధ్యక్షులు బొల్లి గంగాధర్ ,ప్రధానకార్యదర్శి వాసురే రమేశ్ మరియు ప్రధాన సలహాదారు బస్వంత్ రావు పటేల్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మండల మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ,మాజీ ఎంపీటీసీ లు,మాజీ సర్పంచ్లు,ప్రస్తుత సర్పంచ్లు,ముఖ్య నాయకులు,గ్రామ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొని మాజీ సీఎం కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి...భగవంతుడు వారికి మంచి ఆయురారోగ్యం ఇచ్చి,హ్యాట్రిక్ మూడవ సారి ముచ్చటగా ముఖ్యమంత్రి భగవంతుడు అవకాశం ఇవ్వాలని కోరుకోవడం జరిగింది.ఇట్టి కార్యక్రమం విజయవంతం చేసిన కార్యకర్తలకు నాయకులకు బి ఆర్ఎస్ జుక్కల్ మండల అధ్యక్షులు బొల్లి గంగాధర్ గారు,ప్రధాన కార్యదర్శి వాసురే రమేశ్ కుమార్ పటేల్ , ప్రధాన సలహాదారు బస్వంత్ రావు పటేల్ కృతజ్ఞతా తెలిపారు.2028 లో జుక్కల్లో షిండే సాబ్...రాష్ట్రంలో కేసీఆర్ రావాలని బి ఆర్ఎస్ కార్యకర్తలు ఆకాంక్షించారు.

